తిరుమల తిరుపతి దేవస్దానం (టిటిడి) చైర్మన్‌గా ప్రస్తుతం చదలవాడ కృష్ణమూర్తి పనిచేస్తున్నాడు. ఈ ట్రస్ట్ బోర్డ్‌లోని సభ్యుల పదవికాలం ఏడాది మాత్రమే. ఏడాది దాటిన తర్వాత ఆయా మెంబర్లను తిరిగి మరో ఏడాది పొడిగించడమో లేక వారి స్ధానంలో మరొకరిని నియమించడమో జరుగుతుంది. కాగా కిందటి ఏడాది పవన్‌కళ్యాణ్ మాటకు చంద్రబాబు వద్ద తిరుగులేకపోవడంతో పవన్ రికమండేషన్‌తో హరిప్రసాద్ బోర్డు మెంబర్‌గా ఎన్నికయ్యాడు. బోర్డ్ మెంబర్‌గా ఎన్నికైన మరో సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు శిష్యుడు కావడంతో ఆయనకు కూడా ఈ పదవి దక్కింది. అయితే ఈ సారి ఇతను మరోసారి ఎన్నిక కావడం కేవలం లాంఛనమే కానుంది. అదే సమయంలో పవన్ రికమండేషన్ చేసిన హరిప్రసాద్‌కు మాత్రం మరో ఏడాది పొడిగింపు వస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశం అయింది. వాస్తవానికి హరిప్రసాద్ పదవీకాలం ఈనెల 27తో ముగియనుంది. దాంతో ఆయన మరోసారి పవన్ చేత రికమెండ్ చేయించాలని భావిస్తున్నాడు. కానీ ప్రస్తుతం చంద్రబాబు, పవన్‌ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తుండటంతో పవన్ ఆయనను మరలా రికమెండ్ చేస్తాడా? మౌనంగా ఉంటాడా? పోనీ రికమెండ్ చేసినా చంద్రబాబు.. పవన్ మాటకు విలువ ఇస్తాడా? అనే విషయం అందరిలో ఆసక్తిని రేపుతోంది.