Advertisementt

మహేష్‌ బావపైనే అందరి చూపు!

Sun 24th Apr 2016 04:11 PM
sudheer babu,bhagi movie,mahesh babu,sms,premakatha chitram,villain,bollywood  మహేష్‌ బావపైనే అందరి చూపు!
మహేష్‌ బావపైనే అందరి చూపు!
Advertisement
Ads by CJ

'ఎస్సెమెస్‌' చిత్రంతో హీరోగా పరిచయం అయిన మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు 'ప్రేమకథా చిత్రమ్‌'తో తొలి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన కొన్నిచిత్రాల్లో నటించి ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. కాగా అప్పుడెప్పుడో 2004లో వచ్చిన 'వర్షం' చిత్రంకు రీమేక్‌గా బాలీవుడ్‌లో టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్దాకపూర్‌లు కలిసి నటిస్తున్న చిత్రం 'బాఘీ'. కాగా ఈ చిత్రంలో సుదీర్‌బాబు తెలుగు వెర్షన్‌లో విలన్‌గా నటించిన గోపీచంద్‌ పాత్రను బాలీవుడ్‌లో చేస్తున్నాడు. ఇటీవల ఈచిత్రం నూతన ట్రైలర్‌ విడుదలైంది. విలన్‌ సుధీర్‌బాబును హైలైట్‌ చేస్తూ ఈ టీజర్‌ను కట్‌ చేశారు. ఈ ట్రైలర్‌లో సుధీర్‌బాబును, ఆయన సిక్స్‌ప్యాక్‌నే కాదు.. ఆయన నటనను చూసినవారు ఇతను సుధీర్‌బాబేనా? అతనిలో అంత టాలెంట్‌ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఈ సుధీర్‌బాబు మహేష్‌ బావ అని తెలుసుకున్న బాలీవుడ్‌ వర్గాలు ఆశ్యర్యపోతున్నాయి. ఆయనకు బాలీవుడ్‌లో మరిన్ని కీలకపాత్రలు ఇవ్వడానికి బాలీవుడ్‌ వర్గాలు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ 'బాఘీ' చిత్రానికి మన వాడైన సుధీర్‌బాబు హైలైట్‌ కానుండటం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ