శ్రీనువైట్లకు ఎవరితోనైనా సమస్యలు తలెత్తితే తన తదుపరి చిత్రంలో వారిపై సెటైర్లు వేస్తుండటం అలవాటు. 'దుబాయ్‌శ్రీను'లో ఎమ్మెస్ నారాయణ పాత్ర నుంచి 'కింగ్'లో బ్రహ్మానందం క్యారెక్టర్, 'ఆగడు'లో సోనూసూద్ క్యారెక్టర్.. ఇలా చాలా చెప్పుకోవచ్చు. కాగా ఇటీవల తన హవా కోల్పోయిన శ్రీనువైట్ల త్వరలో మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్ బేనర్‌పై నల్లమలుపు బుజ్జి, ఠాగూరు మధులు నిర్మాతలుగా 'మిస్టర్' చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రంలో శ్రీనువైట్ల నాగార్జునపై సెటైర్లు వేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. నిజానిజాలు తెలియకపోయినప్పటికీ శ్రీనువైట్ల అఖిల్ సినిమా ఛాన్స్ కోసం నాగ్ చుట్టూ బాగా తిరిగాడు. అయినా నాగ్ ఒప్పుకోలేదు. ఇక 'కింగ్' చిత్రం షూటింగ్‌లో కూడా నాగ్‌కు, వైట్లకు ఎన్నో వివాదాలు చెలరేగాయి. దాంతో ఆయన తన తాజా చిత్రంలో నాగ్‌ని, 'మీలో ఎవరు కోటీశ్వరుడు', 'సోగ్గాడే చిన్నినాయనా, మనం, ఊపిరి' చిత్రాల స్పూఫ్ లను తీయనున్నాడని సమాచారం. మరి ఇలా చేసుకుంటే వైట్ల శత్రువుల జాబితాలో మరో స్టార్ చేరినట్లేనని అంటున్నారు. కాగా ఈ చిత్రం కోసం శ్రీనువైట్ల కోనవెంకట్‌కు రైట్ హ్యాండ్ అయిన గోపీమోహన్‌ను తన యూనిట్‌తో కలుపుకొని భవిష్యత్తులో కోనతో కలిసి పనిచేయనని గోపీమోహన్ చేత అగ్రిమెంట్ రాయించుకున్నట్లు వినిపిస్తోంది.