Advertisementt

ఫ్లాపు చేతులు కలిస్తే!

Sun 24th Apr 2016 03:56 PM
raja cheyyi vesthe,nara rohit,taraka rathna  ఫ్లాపు చేతులు కలిస్తే!
ఫ్లాపు చేతులు కలిస్తే!
Advertisement
Ads by CJ

కెరీర్ మొదట్లో నారా రోహిత్ ప్రాజెక్ట్ సెలెక్షన్ అద్భుతంగా ఉండేది. బాణం, సోలో, అసుర, ప్రతినిధి లాంటి మంచి కథలు ఎన్నుకుంటూ జనాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంటూ వచ్చారు. అదేంటో గత కొద్ది కాలంగా కమర్షియల్ ఇమేజి కోసం వెంపర్లాడుతూ తుంటరి, సావిత్రి లాంటి ఫ్లాపులు రుచి చూసారు. ఈ ఏడాది రోహిత్ నుండి రాబోతున్న మూడో సిత్రం రాజా చెయ్యి వేస్తే. అభిరుచి గల నిర్మాత సాయి కొర్రపాటి గారి నిర్మాణ సారధ్యంలో రూపొందిన రాజ చెయ్యి వేస్తేని ఒక యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 29న విడుదలకు సిద్ధమైన ఈ మూవీలో మరో ముఖ్య విలన్ పాత్రలో నందమూరి తారకరత్న నటించడం విశేషం. నారా రోహిత్ లాగానే తారకరత్న గతం కూడా ఘనం. ఒకటో నంబర్ కుర్రాడుతో వేసిన మొదటి అడుగుతోనే సుమారుగా డజన్ సినిమాలు సైన్ చేసినా ఒక్కటి కూడా నందమూరి కీర్తి ప్రతిష్టల దరిదాపులకు చేరలేకపోయాయి. అందుకే విలన్ వేషాల మీద మనసు పడి అమరావతి అన్న రవిబాబు సినిమాలో కూడా నటించి మెప్పించారు. చాన్నాళ్ళ తర్వాత రాజ చెయ్యి వేస్తేతో మరోసారి ప్రతినాయకుడిగా మారారు. ఇలా రెండు ఫ్లాప్ చేతులు వేసి చేసిన రాజా చెయ్యి వేస్తే అనూహ్య విజయం సాధించాలని కోరుకుందాం!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ