రేస్ గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి యాభై కోట్ల పై చీలుకు సినిమాల తరువాత అల్లు అర్జున్ మార్కెట్ ఒక్కసారిగా ఉబ్బిపోయింది. అటు తరువాత బన్నీని కూడా రామ్ చరణ్ సరసన చేర్చి విపరీతమైన స్టార్ డం అంటగట్టే ప్రయత్నాలు కూడా మెగా అభిమానులు మెండుగా చేసిన దాఖలాలు ఉన్నాయి. అందుకే సరైనోడు సినిమా విడుదలకు ముందు నుండీ విపరీతమైన హైపుకు గురైంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ చేసిన తప్పల్లా సరైనోడులో కథ కాకుండా మాస్, యాక్షన్ సినిమాగా నిలబెట్టే ఆలోచన చేయడమే. ఇది పూర్తి స్థాయి ఊర మాస్ చిత్రమే అన్నది కాదనలేని నిజం. అందుకే రివ్యూలు, క్లాస్ ఆడియెన్సు సరైనోడును సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటున్నారు ఒక వర్గం విశ్లేషకులు.
ఎందుకంటే, మా సినిమా ఇలా ఉండబోతోంది బాబూ అంటూ ముందు నుండీ ప్రేక్షకులని అలర్ట్ చేసినా సరే, సరైనోడు మొదటి రోజు వసూళ్లు బన్నీ కెరీర్లోనే హయ్యెస్ట్ నంబర్లు నమోదు చేసుకున్నాయి. బోయపాటి ఫార్ములా ఒక్కటే. కథ పాతదే, పలుచనదే అయినా హీరోలో పవర్ ఉంటె మాస్ మసాలాలు జత చేసి ఎక్కడికో తీసుకెళ్లవచ్చు. సరైనోడుకు అదే జరిగింది. మెట్రో జనాలు, ఓవర్సీస్ ప్రేక్షకులు ఏమో గానీ కింది స్థాయి B, C సెంటర్ సినిమా పిచ్చోళ్ళు బోయపాటి, బన్నీవడ్డించిన ఊర మాస్ విందును కడుపారా ఆరగిస్తున్నారట. ఫస్ట్ డే షేర్ సుమారుగా పదిన్నర కోట్లు దాటింది. ఇక శని, ఆదివారాలు సరిగ్గా తగులుకుంటే అల్లు అర్జున్ మరో చిత్రాన్ని 50 కోట్ల క్లబ్బులో చేర్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే సుప్రీం, 24 వచ్చేవరకు రెండు వారాలు ఎదురు పోటీయే లేదుగా!