అందరం అనుకున్నట్లుగానే నిర్మాతలు అనుకున్న తేదీకి సరైనోడును సరిగ్గానే సినిమా హాళ్ళలో దింపేశారు. వేసవి తాపాన్ని తీర్చే పక్కా మాస్ సినిమాగా అభివర్ణించిన అల్లు అర్జున్ సరైనోడు ఎంత కాదన్నా మరో వారం రోజుల పాటు హవా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఏప్రిల్ 29న రాజా చెయ్యి వేస్తే తరువాత మే 6న రానున్న 24, సుప్రీం సినిమాలకు తోడుగా మే 13న బ్రహ్మోత్సవం కూడా ఫిక్స్ అయిపోయినట్టే. అంటే మే మూడో వారం వరకు ఎడతెరపి లేకుండా బడా సినిమాలు మనకు కనువిందు చేయనున్నాయి. నిజానికి మే 6 లేదా 13న రావాలనుకున్న నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అ.. ఆ...కి ఇప్పుడా అవకాశం ఏ మాత్రం లేదనే చెప్పుకోవాలి. మే 13 వరకు ప్రతీ వారము జామ్ ప్యాక్ అవుతుండడంతో అ.. ఆ... మే మూడో వారం లేదా నాలుగో వారం వరకు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నితిన్ మార్కెట్ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో నిర్మాత చినబాబు కూడా రిస్క్ తీసుకోలేరు. దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు మీద ఓపెనింగ్స్ దండిగానే రావచ్చు కానీ ఎదురుగా పోటీ సినిమా ఉంటె ఆ అడ్వాంటేజ్ సైతం మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, అన్ని లెక్కల తరువాత అ... ఆ... ఒంటరిగా తాపీగా మే చివర్లో సందడి చేయడమే కరెక్ట్.