సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఆలస్యంగా సరైన నిర్ణయం తీసుకున్నప్పటికీ ఫలితం ఉండకపోవచ్చు. ఈ తేడా బాలకృష్ణ, చిరంజీవి విషయంలో కనిపిస్తోంది. బాలయ్య తన వందవ చిత్రం కోసం అనేక కథలు విన్నారు. చివరగా గౌతమిపుత్ర శాతకర్ణి ఓ కే చేయడమే కాదు సినిమా ప్రారంభించేశారు. అదే చిరంజీవి విషయానికి వస్తే ఆయన 150వ చిత్రం ఇంకా తేలలేదు. దాదాపు నాలుగేళ్ళుగా నాన్చుతున్నాడు. ఇప్పటికే అనేక కథలు విన్నప్పటికీ, ప్రతిదానిపై అనుమానమే. అభద్రత. దీంతో చిరు చిత్రం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. తెలుగు కథలు వద్దు అరువు కథలు తెచ్చుకుందామనే ఆలోచన ఉంది. కానీ దానిపై స్పష్టతలేదు. ఇక దర్శకుల విషయానికి వస్తే అనేక మంది పేర్లు ప్రస్తావనకి వచ్చాయి. మారుతున్నాయి. చిరంజీవిలో ఇంతటి సందిగ్దత ఉండడం అభిమానులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పేటప్పుడు కూడా ఇలాగే అతిగా ఆలోచించి రాంగ్ స్టెప్ వేశారు.
కేవలం ఒక సినిమా జీవితాన్ని శాసించదు. అదే జీవితం కాదు. ఈ విషయాలు స్పష్టంగా తెలిసిన చిరంజీవి 150వ సినిమాను ఇంకా ఫైనల్ చేయలేకపోవడం ఆయన చంచల మనస్తత్వాన్ని బయటపెడుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే అభిమానుల నుండి రివర్స్ స్పందన వచ్చే ప్రమాదం ఉంది.