బాలీవుడ్ హీరో ఇమ్రాన్‌హాష్మికి సీరియల్ కిస్సర్‌గా పేరుంది. కానీ ఇప్పుడు ఆ స్దానాన్ని తన పేరిట లిఖించుకోవడానికి హీరో రణవీర్‌సింగ్ దూకుడు పెంచాడు. తన తాజా చిత్రం బేఫికర్‌లో ఏకంగా 23 కిస్సింగ్ సీన్లు ఉన్నాయట. ఈ చిత్రం ట్రైలర్ మొత్తం ముద్దులతో నిండిపోయింది. ఈ చిత్రంలో రణవీర్‌సింగ్ సరసన వాణి కపూర్ నటిస్తోంది. ఇలా ముద్దులతో ముంచెత్తడం రణవీర్‌కు ఇదే మొదటి సారి కాదు. గత కొన్ని చిత్రాలుగా ఆయన చిత్రాల్లో కిస్సింగ్ సీన్లు బాగానే ఉంటూ వస్తున్నాయి. దీంతో బాలీవుడ్‌లో ఆయన్ను అందరు కిస్సింగ్ రాజా అనే ముద్దు పేరుతో పిలుస్తున్నారు. బేఫికర్ చిత్రం విషయానికి వస్తే ఈచిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఆదిత్యచోప్రా దర్శకుడు కాగా యశ్‌రాజ్ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా ఘాడచుంభన సీన్‌తోనే మొదలైంది. మొత్తానికి కిస్సింగ్‌ల విషయంలో ఇమ్రాన్‌హష్మీని మించిపోయిన రణవీర్ ముద్దుల వీరుడు గా మాంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.