త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ లో వస్తోన్న 'అ ఆ' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. బుధవారం రాత్రి నితిన్, సమంతల మధ్య పాట చిత్రీకరిస్తున్న సమయంలో సడెన్ గా పవన్ కళ్యాణ్ సెట్లో ప్రత్యక్షమయ్యాడు. టీం అందరూ వారి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో పవన్ అక్కడకు వెళ్లి అందరికీ షాక్ ఇచ్చాడు. సినిమా గురించి వివరాల్ని స్వయంగా పవన్ అడిగి మరీ తెలుసుకున్నాడట. సెట్ బావుందని ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది. నితిన్, పవన్ కు వీరాభిమాని. తన సినిమా సెట్ కు పవన్ రావడం నమ్మలేకపోయానని నితిన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. త్రివిక్రమ్, పవన్ ల మధ్య ఉన్న అనుబంధంతోనే పవన్ అక్కడకి వెళ్ళినట్లు సమాచారం.