భారీ అంచనాలతో విడుదలైన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయం లేకపోవడంతో బాక్స్ ఆఫీసు వద్ద చతికిలపడింది. ఎంత ఫ్లాప్ టాక్ వచ్చినా, పవన్ కళ్యాణ్ సినిమా అంటే కనీసం రెండు వారాలు మంచి కలెక్షన్లు రాబడుతుంది. కానీ, సర్దార్లో అటు ఫాన్స్ కి, ఇటు ప్రేక్షకులకి మెచ్చే ఒక్క అంశం ఒక్కటి లేకపోవడంతో, దాదాపు డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా, దాంట్లో కనీసం సగం రాబట్టడానికి నానా తంటాలు పడుతుంది. పవన్ కళ్యాణ్ అయితే తన సినిమా గురించి దాదాపు మర్చిపోయినట్టున్నాడు. అయితే, సర్దార్ పై భారీగా డబ్బులు పెట్టిన పంపిణీదారులు మాత్రం లబో దిబో మంటున్నారు. కానీ, ఎవ్వరు కూడా తమ నష్టాల్ని, కష్టాల్ని బయటకి చెప్పుకోవడం లేదు. మరి వాళ్ళ ఇబ్బందుల్ని అర్ధం చేసుకొని పవన్ కళ్యాణ్ ఏమైనా ఆర్ధిక సహాయం చేస్తాడేమో చూడాలి, ఎందుకంటే తను సర్దార్ కి సహా నిర్మాత కూడా. సినిమాకి పెట్టుబడి పెట్టక పోయినా, తన సహచర నటులు డిస్ట్రిబ్యూటర్లకి కొంత చెల్లించిన సందర్భాలున్నాయి. మహేష్ బాబు ఆగాడు సినిమా పరాజయం పాలవడంతో, తన రెమ్యునరేషన్ లోంచి కొంత మొత్తం తిరిగి ఇచ్చాడు. అసలే తన జనసేన పార్టీ మున్ముందు కార్యక్రమాల కోసం డబ్బులు జమ చేసే పనిలో ఉన్నాడు పవన్. మరి, ఈ టైంలో పంపినీదారులపై ఏమైనా కరుణ చూపిస్తాడా?