కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో సుమారుగా ఇరవై నిమిషాల నిడివి గల ఒక పాత్ర ఉంది. ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం. అయితే దీనికోసం పూరి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నాడట. గతంలో పూరి, అమితాబ్ తో 'బుడ్డా హో గయా తేరా బాప్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. వారి ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో పూరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోరి అడిగితే అమితాబ్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగానే అమితాబ్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ రావడం ఖాయం. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!