Advertisementt

హిట్టు అమ్మడుని పట్టిన నితిన్

Tue 19th Apr 2016 03:46 PM
nithin,shruti haasan  హిట్టు అమ్మడుని పట్టిన నితిన్
హిట్టు అమ్మడుని పట్టిన నితిన్
Advertisement
Ads by CJ

హిట్టు ఫ్లాపులు పక్కకు పెడితే, హీరో నితిన్ ఎక్కువగా టాప్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇలియానా, జెనీలియ, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ లాంటి అగ్ర కథానాయికలతో జోడీ కట్టిన నితిన్, తన తదుపరి చిత్రం అ. ఆ.. లో సమంతా సరసన కనిపించనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిచిన ఈ కుటుంబ కథా చిత్రం మే 6 న విడుదలకు సన్నద్ధమౌతుంది. ఈ మధ్యే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, అ.ఆ.. తర్వాత తనకు గుండె జారి గల్లంతయ్యిందే లాంటి పెద్ద హిట్ ఇచ్చిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడనే విషయం మనందరికీ విదితమే. ఈ సినిమాకు గాను శృతి హాసన్ ను సంప్రదించారు అని తెలిసింది. అయితే, ఈ సినిమా చేయడానికి ఏ ఇబ్బంది లేకపోయినా డేట్స్ కుదురుతాయో లేదో అని చెప్పిందట. ఒకవేళ, శృతి గనక ఈ మూవీ ఒప్పుకుంటే, నితిన్ మరొక స్టార్ హీరోయిన్ని రొమాన్స్ చేసే అవకాశం దొరికినట్టే. అసలే తెలుగులో వరుస హిట్లతో శృతి మంచి ఫాం మీద ఉంది. ఎంతైనా నితిన్ లక్కీ ఫెలో కదా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ