Advertisementt

ఆ రూమర్స్ లో నిజం లేదంటోంది!

Tue 19th Apr 2016 03:40 PM
rakul preeth singh,hyderabad,own house  ఆ రూమర్స్ లో నిజం లేదంటోంది!
ఆ రూమర్స్ లో నిజం లేదంటోంది!
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తక్కువ కాలమైనా.. టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. తన కెరీర్ లో ఫ్లాపులు ఉన్నప్పటికీ ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం తగ్గలేదు. వరుస సినిమాల్లో నటిస్తూ.. బిజీ స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా రకుల్ హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుక్కుంది. అయితే ఈ ఇల్లును తనకు ఎవరో ఒక అబ్బాయి కొనిచ్చాడనే రూమర్స్ వచ్చాయి. వీటిపై తాజాగా రకుల్ స్పందించింది. అసలు ఇలాంటి రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తారో..? నిజంగానే నాకు ఒక అబ్బాయి ఖర్చుపెట్టాలనుకుంటే షాపింగ్ చేస్తాను కానీ ఇల్లు ఎలా కొనిపించుకుంటాను. ఒక్కో రూపాయి పోగేసి నేను ఇల్లు కొంటే సింపుల్ గా రకుల్ కి ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట అనేస్తున్నారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు బాధతో పాటు కోపం కూడా వస్తుంది. నిజానికి ఇంటి లోన్ విషయంలో మా నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సరిపోయింది. ఆయనకు, నా ఫ్యామిలీకు నిజమేంటో.. తెలుసు. నేను ఎంతో కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంటే దానిమీద ఏవేవో రూమర్స్ రాసేస్తున్నారని చెప్పుకొచ్చింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ