Advertisementt

చిరు సినిమా ఇంకా ఆలస్యం..?

Tue 19th Apr 2016 02:24 PM
chiranjeevi,150th film,vinayak,katthi movie  చిరు సినిమా ఇంకా ఆలస్యం..?
చిరు సినిమా ఇంకా ఆలస్యం..?
Advertisement
Ads by CJ

చిరంజీవి 150వ సినిమా కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు ఎట్టకేలకు వినాయక్ తో చిరు సినిమా కన్ఫర్మ్ చేశాడని వార్త రావడంతో సంతోషపడ్డారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వినాయక్, చిరంజీవి కలిసి తమిళ 'కత్తి' సినిమా రీమేక్ చేయాలనుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథను చిరంజీవి తగినట్లుగా మార్పులు చేర్పులు చేశారు వినాయక్. అయితే చిరంజీవి మాత్రం ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారట. 

డెవలప్ చేసిన కథ చిరుకి నచ్చకపోవడంతో ఈ కథను పక్కన పెట్టేస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో వినాయక్ చెప్పిన ఒక లైన్ మెగాస్టార్ కి నచ్చడంతో ఆ లైన్ ను డెవలప్ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినాయక్ అదే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది చిరంజీవిను తెరపై చూస్తామనుకున్న ఆయన అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వినాయక్ కథ రెడీ చేసి సినిమా షూటింగ్ ప్రారంభించినా.. ఈ సంవత్సరంలో మాత్రం సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ