Advertisementt

శర్వానంద్‌కి సుకుమార్‌తో ఛాన్స్ !

Tue 19th Apr 2016 10:08 AM
sharvanand,sukumar,surya pratab,kumar 21f  శర్వానంద్‌కి సుకుమార్‌తో ఛాన్స్ !
శర్వానంద్‌కి సుకుమార్‌తో ఛాన్స్ !
Advertisement
Ads by CJ

వరుస హిట్లతో ఉన్న యంగ్‌ హీరో శర్వానంద్‌ చుట్టూ నిర్మాతలు చేరుతున్నారు. కాగా త్వరలో క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ శర్వానంద్‌తో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. అయితే ఆయన ఈ చిత్రానికి కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట. గతంతో ఆయన ఇలానే తీసిన 'కుమారి 21ఎఫ్‌' ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ రైటింగ్స్‌ బేనర్‌పై ఈ చిత్రం నిర్మితం కానుంది. కాగా ఈ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలను 'కుమారి 21ఎఫ్‌' దర్శకుడు సూర్యప్రతాప్‌కే అప్పగించనున్నాడట. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను సుకుమారే అందించనున్నాడు. మరి నిర్మాతగా సుకుమార్‌ ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తాడో లేదో చూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ