Advertisementt

మాటీవిని కూడా ఇరుకున పడేసిన 'సర్దార్‌'!

Mon 18th Apr 2016 11:17 PM
sardaar gabbar singh,maa tv,satellite rights,pawan kalyan,collections  మాటీవిని కూడా ఇరుకున పడేసిన 'సర్దార్‌'!
మాటీవిని కూడా ఇరుకున పడేసిన 'సర్దార్‌'!
Advertisement

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఊహించని విధంగా భారీ నష్టాలు తీసుకొస్తోంది. ఆ ఎఫెక్ట్‌ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే కాదు మాటీవీకి సైతం సోకాయి. ఈ చిత్రం కలెక్షన్లు ఎవ్వరికీ నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ను మాటీవీ జెమిని, జీ తెలుగు చానెల్స్‌తో పోటీ పడి మరీ దక్కించుకుంది. ఈ రైట్స్‌ కోసం మాటీవీ 12.5 కోట్లు చెల్లించింది. 'బాహుబలి' తర్వాత ఎక్కువ రేటు పెట్టింది 'సర్దార్‌' చిత్రానికే. దాంతో ఇప్పుడు మాటీవీ యాజమాన్యం డ్యామేజీ కంట్రోల్‌కు పూనుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మాటీవీ యాజమాన్యం 'సర్దార్‌' నిర్మాత శరత్‌మరార్‌ని కలిశారు. ఈ శాటిలైట్‌ రైట్స్‌ కోసం అడ్వాన్స్‌ చెల్లించి అగ్రిమెంట్‌ చేసుకున్న మాటీవీ సినిమా ఫలితం దారుణంగా ఉంది కాబట్టి అగ్రిమెంట్‌ను క్యాన్సిల్‌ చేసి, రేటు తగ్గించమని అడుగుతున్నారు. అయితే శరత్‌మారార్‌ మాత్రం అలాంటివి అడగవద్దు.. తాము త్వరలో పవన్‌తో చేయబోయే చిత్రంలో దాన్ని అడ్జెస్ట్‌ చేస్తానని హామీ ఇచ్చాడట. మాటీవీ మాత్రం రేటు తగ్గించాల్సిందేనని పట్టుపడుతోంది. ఇక మరో విషయానికి వస్తే 'సర్దార్‌' తెలుగు సినిమా హిస్టరీలోనే పెద్ద డిజాస్టర్‌. 'బాహుబలి'ని బెంచ్‌ మార్కుగా పెట్టుకుని, ఆకాశాన్ని అంటే రేట్లతో ఈ చిత్రాన్ని అమ్మేశారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. మినిమం కలెక్షన్లు కూడా నమోదు చేయలేకపోతోంది. అయితే ఈ చిత్రం 50కోట్లు వసూలు చేసిందంటూ ప్రకటనలు ఇస్తూ ఫ్యాన్స్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్స్‌ అంతా కలిసి మీటింగ్‌ పెట్టుకుని, పవన్‌ దగ్గర తమ సంగతి ఏమిటని అడగాలనుకుంటున్నారు. అయితే పవన్‌ ఇప్పుడు తన వద్ద ఏమీ లేదని, చివరకు ఆఫీస్‌ బిల్లులు కూడా కట్టడం లేదన్నట్లుగా మీడియాకు చెబుతున్నాడు. ఇప్పటివరకు పవన్‌ సినిమా రిజల్ట్‌పై పెదవి విప్పడం లేదు. హిట్‌, ఫ్లాప్‌ అనే విషయమై పవన్‌, శరత్‌మరార్‌లు మల్ల గుల్లాలు పడుతున్నారు. మరి ఈ పంచాయతీ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement