అమీర్‌ఖాన్, షారుఖ్ ఖాన్‌లు అసహనంపై అనవసర కామెంట్స్ చేసిన తర్వాత ఓ వర్గం ప్రేక్షకులు వారిని ఆరాధించడం మానేశారని, అది వారి చిత్రాల కలెక్షన్లపై కూడా ప్రభావం చూపుతోందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. షారుఖ్ నటించిన 'హ్యాపీ న్యూఇయర్' చిత్రం మొదటి రోజు 44కోట్లు వసూలు చేసింది. కాగా 'బాజీరావు మస్తానీ'తో పోటీ పడి ఫ్లాప్ అయిన 'దిల్‌వాలే' చిత్రం సైతం బ్యాడ్‌టాక్ వచ్చినా కూడా తొలిరోజు 21కోట్లు వసూలు చేసింది. కాగా ఇటీవల షారుఖ్ నటించిన 'ఫ్యాన్' చిత్రం విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలను పాజిటివ్ టాక్ వస్తే ఇక బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం. కానీ 'ఫ్యాన్' చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ చిత్రం తొలిరోజు కేవలం 19.82కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. దీంతో ఈ చిత్రం వసూళ్లను గమనించిన బాలీవుడ్ ట్రేడ్‌వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ చిత్రం రికార్డులకు దూరంగా ఆగిపోయింది. షారుఖ్ రేంజ్‌కి ఈ వసూళ్లు చాలా తక్కువని అందరూ ఒప్పుకుంటున్నారు. కాగా షార్‌ఖ్‌పై కొందరు అలిగారని, అందుకే ఆయన చిత్రాలు వరుసగా తక్కువ వసూళ్లు సాధిస్తున్నాయని కొందరు విశ్లేషిస్తుంటే మరి కొందరు మాత్రం అలాంటిదేమీ లేదని, ఐపిఎల్ సీజన్ కారణంగానే కలెక్షన్లు తగ్గాయని అంటున్నారు. మరి ఆయన నటించే 'రాయిస్' చిత్రం రంజాన్‌కు విడుదలకు సిద్దమవుతోంది. అప్పుడు కానీ షార్‌ఖ్ సత్తా తెలియదని, ఆ చిత్రం ఆయన కెరీర్‌కు కీలకంగా మారనుందని విశ్లేషిస్తున్నారు.