Advertisementt

మీనా షాకింగ్‌ నిర్ణయం..!

Sun 17th Apr 2016 10:36 PM
meena,meena shocking decision,nainika,theri,meena daughter  మీనా షాకింగ్‌ నిర్ణయం..!
మీనా షాకింగ్‌ నిర్ణయం..!
Advertisement
Ads by CJ

సీనియర్‌ హీరోయిన్‌ మీనా బాలనటిగా పరిచయమై ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా ఆమె కూతురు నైనిక విజయ్‌ నటించిన 'తేరీ' (తెలుగులో 'పోలీస్‌') చిత్రంలో బాలనటిగా అదరగొట్టింది. సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్నప్పటికీ మీనా కూతురుకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ పాప కూడా ఇక బాలనటిగా బిజీ కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ మీనా మాత్రం మంచి పాత్ర కావడంతోనే తన కూతురు 'తేరీ' చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నానని, అయితే ఆమెను బాలనటిగా మాత్రం కంటిన్యూ చేసే అవకాశం లేదని కుండబద్దలు కొడుతోంది. బాలనటిగా పరిచయమైన తాను తన బాల్యంలో ఎన్నో అనుభూతులను కోల్పోయానని, అందుకే ఆ పరిస్థితి తన కూతురుకు రాకూడదనే నిర్ణయంతోనే తాను ఉన్నానని చెప్పుకొచ్చింది. దీంతో మీనా కూతురిని బాలనటిగా బాగా వాడుకోవచ్చని భావించిన సినీ వర్గాలు మీనా స్టేట్‌మెంట్‌తో షాక్‌కు గురయ్యాయి. మొత్తానికి బాగా ఆలోచించే మీనా ఈ నిర్ణయం తీసుకుందని అర్థమవుతోంది. మరీ మంచి పాత్ర వస్తేనే మీనా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయని, ఏ సినిమాను పడితే ఆ సినిమాను తన కూతురి చేత చేయించదని మాత్రం అర్ధం అవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ