హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయినపుడు వైకాపా నేతలు వ్యంగ్యంగా మాట్లాడారు. తెదెపా తుడుచుపెట్టుకుపోయిందని, దాని ఆఫీసు అమ్మకానికి పెట్టాలని కామెంట్స్ చేశారు. ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి పెట్టాలని వైకాపా ఫైర్ బ్రాండ్ రోజా సూచించింది. చంద్రబాబును ఓటర్లు తిరస్కరించారని కూడా చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో వైకాపా దుకాణం మూసివేసే పరిస్థితి వచ్చింది. వైకాపా నుండి ఇప్పటికే ఇద్దరు శాసనసభ్యులు తెరాసలో చేరారు. మిగతా ఇద్దరితో పాటు ఏకైక ఎ..పి. కూడా తెరాస చేరడానికి సిద్దమయ్యారు. అంటే పార్టీ మెుత్తం తెరాసలో విలీనమవుతుందన్నమాట. ఇంతటి దారుణ పరిస్థితిని వైకాపా నేతలు ఊహించి ఉండరు. దీనిపై ఫైర్ బ్రాండ్ రోజా ఏ మేరకు స్పందిస్తారో చూడాలి. లోటస్ పాండ్ లోఉన్న వైకాపాను ఓఎల్ ఎక్స్ లో పెట్టేయమని తెదేపా ఎదురుదాడి చేస్తే రోజా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మరి.
గ్రేటర్ ఎన్నికల్లో తెదేపా పోరాడి ఓడింది. వైకాపా అసలు పోరాటమే చేయలేదు. అంటే పోటీనే చేయలేదు. ముందుగానే అస్త్ర సన్యాసం చేశారు.
రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, ముందుచూపు కూడా ముఖ్యం. ఎదుటివారపై రాళ్ళేస్తే అవే రాళ్ళు తమపై పడితే ఎలా ఉంటుందో రోజా ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నట్టుంది.