Advertisementt

రామ్‌చరణ్‌ టార్గెట్ పెట్టాడు..!

Sun 17th Apr 2016 09:31 PM
ram charan,sankranthi race,sukumar,dasara,surendar reddy,ram charan movies  రామ్‌చరణ్‌ టార్గెట్ పెట్టాడు..!
రామ్‌చరణ్‌ టార్గెట్ పెట్టాడు..!
Advertisement
Ads by CJ

వరుస పరాజయాల తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'తని ఒరువన్‌' రీమేక్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా దసరాకు పోటీలో దించేలా ఆయన ప్లాన్‌ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్‌ క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని కూడా జులైలో ప్రారంభించాలని చరణ్‌ భావిస్తున్నాడట. ఈ చిత్రం షూటింగ్‌ను వేగంగా డిసెంబర్‌ కల్లా పూర్తి చేసి 2017 సంక్రాంతికి బరిలో నిలపాలని చరణ్‌ టార్గెట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్‌లో షూటింగ్‌ పూర్తి చేసి ఆ వెంటనే వేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేయాలని చరణ్‌ భావిస్తున్నాడు. సాధారణంగా పండగల సీజన్‌ను చక్కగా వాడుకోవడంలో చరణ్‌ సిద్దహస్తుడు. ఆయనకు సంక్రాంతి కూడా బాగానే కలిసొచ్చింది. అంతేగాక సుకుమార్‌ దర్శకత్వం వహించిన '1' (నేనొక్కడినే), 'నాన్నకుప్రేమతో' చిత్రాలు కూడా సంక్రాంతికే విడుదలైన సంగతి తెలిసిందే. '1' చిత్రం డిజాస్టర్‌గా నిలవగా, 'నాన్నకుప్రేమతో' చిత్రం హిట్ గా టాక్ తెచ్చుకుంది.  సో..రామ్‌చరణ్‌-సుక్కు చిత్రం సంక్రాంతికి విడుదలై ఏస్ధాయిలో విజయం సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ