టాలీవుడ్‌లో మెగా హీరోల డామినేషన్ అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడమే లక్ష్యంగా దాదాపు అరడజను మెగాహీరోలు ఎప్పుడూ పోటీలో ముందుంటారు. కానీ గత రెండేళ్ల నుంచి వారి హవా తగ్గింది. ఇతర హీరోలు బాక్సాఫీస్‌లను దున్నేస్తుంటే మెగాహీరోలు మాత్రం హిట్ కోసం అల్లాడిపోతున్నారు. వారు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతున్నారు. 'రేసుగుర్రం' తర్వాత మెగా హీరోలకు సరైన హిట్స్ లేవని చెప్పాలి. 'గోవిండుడు అందరివాడేలే, బ్రూస్‌లీ, గోపాల గోపాల, ముకుంద, కంచె, లోఫర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వులేని జీవితం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సర్దార్‌గబ్బర్‌సింగ్' ఇలా వీరి చిత్రాలు కేవలం యావరేజ్‌లగానో, లేక ఫ్లాప్‌లుగానో మిగిలిపోతూ వస్తున్నాయి. కాగా మెగాభిమానులు ఈ పరిణామంతో కాస్త అసంతృప్తిగా ఉన్నారు. కానీ వీరందరి ఆశలను మోసుకొని బన్నీ 'సరైనోడు'తో ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ చిత్రంతోనైనా మెగాహీరోలు మరలా ఫామ్‌లోకి వచ్చి వారి అభిమానులను అలరిస్తారో లేదో వేచిచూడాల్సివుంది.