'మద్రాస్ కేఫ్' చిత్రంతో తెరంగేట్రం చేసిన బబ్లీ బ్యూటీ రాశిఖన్నా. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత 'జోరు, జిల్, బెంగాల్‌టైగర్' చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఆమె చదువుకునే రోజుల్లో తన వెంట ఎవరు పడలేదని చెప్పుకొచ్చింది. అందం, గ్లామర్, గురించి ఇప్పుడే పట్టించుకొంటున్నాను. కానీ చదువుకునే రోజుల్లో అసలు ఆ ఊసే ఉండేది కాదు. అప్పుడు నేను మీరెవ్వరు ఊహించలేనంత లావుగా ఉండేదాన్ని, అబ్బాయిలయితే అసలు నా వంకే చూసేవారు కాదు. అందుకే ఎవ్వరు ప్రేమిస్తున్నా.. అంటూ నా వెంట పడలేదు. కానీ మోడలింగ్‌లో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నాకే నా శరీరంపై శ్రద్ద పెట్టాను. కేవలం కొద్దినెలలలో నన్ను నేను పూర్తిగా మార్చుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాలేజీలో ఉన్నప్పుడు అబ్బాయిలెవరు నా వెంట పడకున్నా ఇప్పుడు నా అభిమానుల్లో ఎక్కువమంంది అబ్బాయిలే ఉన్నారు.. అని చెప్పుకొచ్చింది రాశిఖన్నా. ప్రస్తుతం ఆమె సాయిధరమ్‌తేజ్ సరసన 'సుప్రీమ్'లో నటిస్తోంది. రవితేజ సరసన 'రాబిన్‌హుడ్'లో నటించనుంది.