'బ్రహ్మోత్సవం' రిలీజ్ విషయంలో దర్శకనిర్మాతలు డైలమాలో పడ్డారు. ఏప్రిల్‌లో రీలీజ్ చేయాల్సి ఉన్నా, షూటింగ్ లేటవ్వడంతో మే నెలలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మహేష్ సినిమా మేలో రిలీజ్ అయి చాలా కాలం అయింది. ఆ నెలలో రిలీజైన మహేష్ చిత్రాలు 'నిజం, నాని' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనాయి. దాదాపు 12ఏళ్ల తర్వాత మళ్లీ మే నెలలో 'బ్రహ్మోత్సవం' రిలీజ్ కానుండటంతో దానిని బ్యాడ్ సెంటిమెంట్‌గా కొందరు భావిస్తున్నారు. కాగా మహేష్ నటించిన గత చిత్రం 'శ్రీమంతుడు' పెద్ద విజయం సాధించింది. వాస్తవానికి ఒక భారీ హిట్ తర్వాత మరలా మహేష్ వెంటనే తన తదుపరి చిత్రంతో హిట్ కొట్టిన సందర్బాలు కూడా లేవు. ఇలా హిట్టు వచ్చిన తర్వాత మరలా హిట్టు వచ్చిన దాఖలాలు లేకపోవడంతో చాలా మంది 'బ్రహ్మోత్సవం' చిత్రం విషయంలో బ్యాడ్ సెంటిమెంట్లను గుర్తుచేసుకుంటున్నారు. 'బ్రహ్మోత్సవం' విషయంలో అలా జరగకూడదని..మహేష్ ఈ మూవీ తో అన్ని సెంటిమెంట్స్ ని బ్రేక్ చేస్తాడని మహేష్ ఫ్యాన్స్ గట్టి నమ్మకం తో వున్నారు. వారి నమ్మకం నిజమై..తెలుగు ఇండస్ట్రీ కి మరో మంచి మూవీ మహేష్ ద్వారా రావాలని కోరుకుందాం.