Advertisementt

ఫైనల్ గా ఎన్టీఆర్ ఓకే చేశాడు..!

Fri 15th Apr 2016 08:51 PM
ntr,jantha garage,vakkantham vamsi  ఫైనల్ గా ఎన్టీఆర్ ఓకే చేశాడు..!
ఫైనల్ గా ఎన్టీఆర్ ఓకే చేశాడు..!
Advertisement
Ads by CJ

గత కొంత కాలంగా ఎన్టీఆర్, వక్కంతం వంశీతో సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ ఉన్న బిజీ షెడ్యూల్ లో వక్కంతం సినిమా పట్టాలెక్కుతుందా అనే అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే వక్కంతం వంశీ మాత్రం తన మొదటి సినిమా ఎన్టీఆర్ తో చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేస్తున్నానని.. నా మొదటి సినిమా ఎన్టీఆర్ తోనే అని వక్కంతం చాలా సార్లు మీడియా ముందు చెప్పారు. అయితే ఇంతకాలానికి ఎన్టీఆర్, వక్కంతం వంశీను స్క్రిప్ట్ లాక్ చేసుకోమని చెప్పారట. సెప్టెంబర్ నుండి సినిమా షూటింగ్ మొదలు పెడదామని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఆగస్ట్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ