Advertisementt

పవన్‌ను ఫ్యాన్స్‌ వేడుకుంటున్నారు!

Fri 15th Apr 2016 11:38 AM
pawan kalyan,pawan kalyan fans,sardaar gabbar singh,sj suriya,dasari narayana rao,trivikram srinivas  పవన్‌ను ఫ్యాన్స్‌ వేడుకుంటున్నారు!
పవన్‌ను ఫ్యాన్స్‌ వేడుకుంటున్నారు!
Advertisement
Ads by CJ

తెలుగులో స్ట్రాంగ్‌గా ఫ్యాన్‌ బేస్‌ ఉన్న హీరోల్లో పవన్‌కళ్యాణ్‌ ఒకరు. అయితే ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌ చాలా వర్రీ అవుతున్నారు. ఓపక్క పవన్‌ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పెద్ద ఫ్లాప్‌ చిత్రంగా మిగిలింది. ఈ చిత్రం కనీసం పవన్‌ వీరాభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది. మరోపక్క పవన్‌ తనకు సినిమాలంటే పెద్ద ఆసక్తి లేదని స్పష్టం చేస్తున్నాడు. తాజాగా పవన్‌.. ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఓ ఫ్యాక్షన్‌ లవ్‌స్టోరీ చేయనున్నానని తెలిపాడు. ఈ విషయం విన్న పవన్‌ ఫ్యాన్స్‌ మరింత కంగారు పడుతున్నారు. సూర్య పవన్‌కు 'కొమరం పులి' వంటి పెద్ద డిజాస్టర్‌ ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన తమిళంలో చేసిన సినిమాలు కూడా ఏవీ ఆడలేదు. దాంతో ఫ్యాన్స్‌ కి కంగారు ఎక్కువైంది. అందుకోసం పవన్‌ అభిమానులంతా కలిసి ఆయనకు ఓ రిప్రజెంటేషన్‌ ఇచ్చారని సమాచారం. ఎస్‌.జె.సూర్య కంటే ముందు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలని, అప్పుడు మంచి క్వాలిటీ రిజల్ట్‌, అవుట్‌పుట్‌ వస్తుందని, డెసిషన్‌ను మరోసారి ఆలోచించుకోవాలి అని ఆ రిప్రజెంటేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్‌ దాసరికి సినిమా చేయాలనే నిర్ణయాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. మరి ఈ విషయంలో పవన్‌ ఏమంటాడో చూడాలి. ఆయన సాధారణంగా తన అభిమానుల మాటకు బాగా విలువ ఇస్తారనే పేరుంది. మరి పవన్‌ అభిమానుల గోడును ఆలకిస్తాడా? లేక తాననుకున్న దారిలోనే వెళ్లతాడా? అనేది వేచిచూడాల్సిన అంశం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ