Advertisementt

మహేష్‌ చిత్రంపై పవన్‌ సినిమా ప్రభావం!

Fri 15th Apr 2016 11:15 AM
mahesh babu,brahmotsavam movie,sardaar gabbar singh,distributors,doubts on brahmotsavam movie  మహేష్‌ చిత్రంపై పవన్‌ సినిమా ప్రభావం!
మహేష్‌ చిత్రంపై పవన్‌ సినిమా ప్రభావం!
Advertisement
Ads by CJ

ఎన్నో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' బాక్సాఫీస్‌ వద్ద కుదేలైంది. కాగా ఈచిత్రం పరాజయానికి వీక్‌ స్టోరీ, వీక్‌ స్క్రీన్‌ప్లే కారణం అని అందరూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించిన పవన్‌దే తప్పంతా అని తేలుస్తున్నారు. ఇందులో దర్శకుడు బాబి తప్పేమీ లేదంటున్నారు. ఇప్పుడు ఈ రిజల్ట్‌ని బేస్‌ చేసుకొని ఫిల్మ్‌సర్కిల్స్‌లో మరీ ముఖ్యంగా ట్రేడ్‌ వర్గాల్లో ఇంకో టాక్‌ బయలుదేరింది. మహేష్‌ నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' ఎలా ఉండబోతోంది? అనే సందేహంతో ఈ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆల్‌రెడీ పవన్‌పై అంతంత పెట్టుబడి పెట్టిన బయ్యర్లు సగానికి సగం పైగా నష్టపోయే అవకాశం ఉందని, దాని దెబ్బ నుండి కోలుకోవడానికి బయ్యర్లకు చాలా కాలం పడుతుందని, ఆ ఎఫెక్ట్‌ మరో పెద్ద స్టార్‌ అయిన మహేష్ చిత్రంపై పడుతుందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెద్ద చిత్రాలంటే కోట్లు పెట్టి కొనడం రిస్క్‌ అనే భావన అల్‌రెడీ బయ్యర్లలో కలిగిందని విశ్లేషిస్తున్నారు. 

ఇక శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' కేవలం మహేష్‌, వెంకీల స్టామినా మీదనే ఆడిందని, అందులో కూడా కథ, స్క్రీన్‌ప్లే చాలా వీక్‌ అనే విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు 'బ్రహ్మోత్సవం'లో కూడా అదే మ్యాజిక్‌ జరుగుతుందా? అనే సందేహాలను లేవనెత్తుతున్నారు. మరోపక్క శ్రీకాంత్‌ అడ్డాల ఇటీవల వరుణ్‌తేజ్‌తో తీసిన 'ముకుందా' చిత్రానికి కూడా కథ, స్క్రీన్‌ప్లే సరిగ్గా కుదరలేదని అప్పట్లో విమర్శలు వచ్చిన సంగతిని కూడా వారు గుర్తు చేస్తున్నారు. వీటన్నింటితో పాటు కొన్ని నెలల క్రితం 'బ్రహ్మోత్సవం' కథ సరిగా లేదని, మహేష్‌ మరలా రీరైట్‌ చేయించాడని, సెట్‌లోనే శ్రీకాంత్‌ అడ్డాల సీన్స్‌ను డెవలప్‌ చేయడం, పదే పదే స్క్రిప్ట్‌ను మార్చడం చూసి మహేష్‌ కోపగించడం జరిగిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు.. ఒకానొక సమయంలో మహేష్‌ సీరియస్‌ అయి, దర్శకుడిని తప్పుపట్టడం జరిగిందని మీడియా వర్గాలు కుండ బద్దలు కొడుతున్నాయి. అయితే ఆ తర్వాత నిర్మాతలు తమకు తాముగా ముందుకొచ్చి అన్నీ సజావుగా ఉన్నాయని మీడియాకు తెలిపారు. దాంతో చాలామంది మహేష్‌ 'బ్రహ్మోత్సవం'పై కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ