లోకనాయకుడు కమల్‌హాసన్ త్వరలో తన కుమార్తె శృతిహాసన్‌తో కలిసి ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో కూడా కమల్ తండ్రిగా, శృతిహాసన్ కూతురుగా నటిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం ఓ సీరియస్ సబ్జెక్ట్ ఆధారంగా రూపొందుతుందట. ఈ సినిమా షూటింగ్‌ను కూడా మొత్తం అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, కమల్ స్నేహితుడు, ప్రముఖ మలయాళ దర్శకుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో తెరకెక్కించనున్నారు. బాలీవుడ్‌లో కూడా ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్29న ప్రారంభం అవుతుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి నిజజీవితంలో తండ్రి కూతుర్లు అయిన కమల్‌హాసన్, శృతిహాసన్‌లు తెరపై ఎలా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచిచూడాల్సివుంది...!