Advertisementt

శ్వేతాబసుకి ఛాన్స్ ఇచ్చాడండోయ్!

Thu 14th Apr 2016 06:11 PM
swethabasu prasad,karan johar,bollywood director and producer,swetha basu prasad in karan johar film  శ్వేతాబసుకి ఛాన్స్ ఇచ్చాడండోయ్!
శ్వేతాబసుకి ఛాన్స్ ఇచ్చాడండోయ్!
Advertisement
Ads by CJ

బాలనటిగా జాతీయ పురస్కారం అందుకున్న టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌ శ్వేతాబసుప్రసాద్‌, ఆమె 'కొత్త బంగారులోకం' ద్వారా టాలీవుడ్‌కి పరిచయమై అందరినీ ఆకట్టుకుంది. కానీ అనుకోకుండా ఆమె వ్యభిచారం కేసులో పట్టుపడింది. చిన్న వయసులోనే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఆమెను పోలీస్‌లు అరెస్ట్‌ చేసినప్పుడు మన టాలీవుడ్‌ హీరోలు, దర్శకనిర్మాతలు ఆమె పట్ల జాలి చూపించారు. కానీ ఆమె నాకు జాలి వద్దు.. అవకాశాలుంటే ఇవ్వమని చెప్పింది. దాంతో మంచు విష్ణుతో సహా పలువురు ఆమెకు అవకాశాలు ఇస్తామని మీడియా ఎదుట హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఎవ్వరూ ఆమె సంగతిని పట్టించుకోలేదు. అదే సమయంలో బాలీవుడ్‌ ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు అయిన కరణ్‌జోహార్‌ కూడా ఆమెకు అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ఒకటి రెండు సీరియల్స్‌లో నటిస్తోంది. కాగా ఆమెను లీడ్‌ రోల్‌కి తీసుకొని త్వరలో ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రం నిర్మించేపనిలో ఉన్నాడు కరణ్‌జోహార్‌. ఈ విషయం తెలిసిన పలువురు కరణ్‌జోహార్‌ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ