'బాహుబలి' చిత్రంతో దేశంలోని అన్ని వుడ్‌లను, విదేశాల్లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్న హీమ్యాన్ యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్. ఈచిత్రంతో ఆయన ఎందరో యువతులకు కలల రాకుమారుడై పోయాడు. ఆయన్ను ఆరాధిస్తున్నవారిలో పలువురు సినీ హీరోయిన్లు కూడా ఉన్నారు. మోడల్‌గా, నటిగా దేశవ్యాప్త గుర్తింపు ఉన్న బ్రిటన్ బ్యూటీ అమీజాక్సన్. 'మదరాసుపట్టణం' అనే తమిళ సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె 'ఏక్ దివానా థా, ఎవడు, ఐ' చిత్రాలతో పాటు తాజాగా విజయ్ 'తేరీ', రజనీ-అక్షయ్‌కుమార్-శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రోబో2.0' చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె ప్రభాస్‌పై మనసు పడింది. 'బాహుబలి'ని చూశానని, ఆ చిత్రంలో ప్రభాస్‌ను చూసి చలించిపోయి మనసు పడేసుకున్నానని, ఆయనతో ఎప్పటికైనా స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కోరికగా ఆమె తెలిపింది. మరి ఆమె మాటలను ప్రభాస్ విన్నాడో లేదో? చూడాలి. ఆమె కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలంటున్నాయి సినీ వర్గాలు. మొత్తానికి సరైనోడుకే ఆమె ఓటు వేసిందంటున్నారు విశ్లేషకులు.