నాగార్జున 'మనం','సోగ్గాడే చిన్ని నాయన','ఊపిరి' లాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. కాని తన తనయులుగా సినిమా రంగ ప్రవేశం చేసిన చైతు, అఖిల్ ల కెరీర్ అనుకున్నత సాఫీగా లేదు. చైతు కెరీర్ లో కొన్ని హిట్స్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో తను ఆశించిన క్రేజ్ రాలేదు. ఇక అఖిల్ మొదటి సినిమాకే ఫ్లాప్ టాక్ రావడంతో ఇప్పుడు తన ఇద్దరి కొడుకుల బాధ్యతను నాగార్జున తీసుకున్నాడు. నిన్న జరిగిన 'ఊపిరి' సినిమా థాంక్స్ మీట్ లో ''రేపటినుండి హతిరాం బాబా సినిమా మొదలుపెట్టనున్నాను. కళ్యాన్ కృష్ణతో నాగచైతన్య సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలానే అఖిల్ కోసం వంశీకృష్ణ డైరెక్షన్ లో కథ ఫైనల్ చేయాలనుకుంటున్నాం. ఇంతకముందు వరకు నా ఇద్దరి కొడుకుల మీద మనసు పెట్టలేదు. ఈ సంవత్సరం అదే పనిలో ఉండాలనుకుంటున్నాను. ఇది నా ప్రామిస్'' అంటూ నాగార్జున తన అభిమానులకు చెప్పారు. ఈ నిర్ణయంతో ఇక చైతు, అఖిల్ ల కెరీర్ లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి..!