మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ వీరి బంధం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఉన్నతస్థితిలోకి రావడానికి అల్లు అరవింద్ బ్రెయిన్ ఎంతగానో ఉపయోగపడింది. బావమరిది అల్లు అరవింద్ చేతిలో కెరీర్‌ను పెట్టి చిరు రిలాక్స్ అయ్యేవాడు. కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఆటుపోట్లను, పోటీని అరవింద్ తన తెలివితేటలతో తప్పించి బావ కళ్ళల్లో ఆనందం చూసేవాడు. చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడంలో అరవింద్ తన వంతు కృషిచేశాడు.. ఇక ఇప్పుడు అదే దారిలో తన వారసుడు అల్లు అర్జున్ కెరీర్‌ను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు అరవింద్. బన్నీని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ఓ క్రేజీస్టార్‌గా మార్చాడు. అల్లు అర్జున్ ఏ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలి, ఏ దర్శకుడితో చేస్తే బన్నీ కెరీర్ బాగుంటుంది.. అనే విషయంలో అరవింద్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రస్తుత బన్నీ గ్రాఫ్ చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుతం ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తున్న బన్నీ ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమాతో పాటు.. సూపర్ దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ప్లాన్ చేశాడు అరవింద్.. సో.. చిరంజీవి తర్వాత అల్లు అరవింద్ ఎక్కువగా శ్రద్ధ పెట్టింది బన్నీ కెరీర్‌పైనే అనే గుసగుసలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.