Advertisementt

బన్నీ, అరవింద్‌ ల నిరాశకు కారణం!

Thu 14th Apr 2016 09:34 AM
allu aravind,sarrainodu,allu arjun,bunny and aravind not happy with thaman music,boyapati sreenu  బన్నీ, అరవింద్‌ ల నిరాశకు కారణం!
బన్నీ, అరవింద్‌ ల నిరాశకు కారణం!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అల్లుఅర్జున్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆడియో ఫంక్షన్‌ నిర్వహించకుండా డైరెక్ట్‌గా ఈ చిత్రం ఆడియోను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే ఈ చిత్రం ఆడియో సక్సెస్‌మీట్‌ పేరుతో వైజాగ్‌లో గ్రాండ్‌ ఫంక్షన్‌ జరిపిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన హడావుడి, ప్రమోషన్లు బాగానే సాగుతున్నాయి. కాగా ఓ విషయంలో మాత్రం ఈ చిత్ర నిర్మాత అల్లుఅరవింద్‌, బన్నీలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. 'సరైనోడు'కు సంబంధించిన ఆడియో విషయంలో వీరిద్దరు సంతోషంగా లేరని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించాడు. కానీ బన్నీ తమన్‌ నుండి ఇంకా బెటర్‌ మ్యూజిక్‌ ఆశించాడని, కానీ తమన్‌ ఆస్థాయి సంగీతం అందించకపోవడమే అరవింద్‌, బన్నీల అసంతృప్తికి కారణం అంటున్నారు. ఈ చిత్రం పాటలకు కూడా ఊహించిన స్థాయిలో రెస్పాన్స్‌ లేదనేది అందరు ఒప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రం సంగీత దర్శకునిగా దేవిశ్రీప్రసాద్‌ను పెట్టుకోవాలని అరవింద్‌, బన్నీ అనుకున్నారని సమాచారం. కానీ 'లెజెండ్‌' సినిమా విషయంలో దేవిశ్రీప్రసాద్‌, బోయపాటి శ్రీనుల మధ్య విబేధాలు రావడంతో బోయపాటి తనే హామీగా ఉంటానని, దేవిశ్రీ వద్దు.. తమన్‌ను పెట్టుకుందాం.. నేను దగ్గరుండి మరీ మంచి అవుట్‌పుట్‌ ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ తండ్రీ కొడుకులు ఒప్పుకున్నారని సమాచారం. మరి ఈ చిత్ర పాటలు కనీసం సినిమా విడుదలైన తర్వాత విజువల్‌గా అయినా బాగుండి, సినిమాకు హెల్ప్‌ అవుతాయా? లేదా? అనే సందేహంలో అందరూ ఉన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ