Advertisementt

ఇక బాలీవుడ్ మీద పడ్డాడు!

Thu 14th Apr 2016 08:47 AM
ram gopal varma,bollywood,veerappan,rgv,attack,pawan kalyan  ఇక బాలీవుడ్ మీద పడ్డాడు!
ఇక బాలీవుడ్ మీద పడ్డాడు!
Advertisement
Ads by CJ

రామ్ గోపాల్ వర్మ ఇంట్లో ఎలుక టైప్. ఒక చోట పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మరో చోటుకి పారిపోతుంది. వర్మ వ్యవహారశైలి కూడా అంతే ఉంది. టాలీవుడ్ లో మకాం వేసి తీయగలిగినన్ని ఫ్లాప్ లు తీశాడు. కర్నాటక వెళ్ళి కిల్లింగ్ వీరప్పన్ చేశాడు. ట్విట్ లు చేస్తూ ముంబాయిలో మకాం వేశాడు. అమితాబ్ ని  పిలిచి తన కంపెనీ చూపించాడు. ఇంతవరకు బాగానే ఉంది. అకస్మాత్తుగా వీరప్పన్ సినిమాను తెరపైకి తెచ్చాడు. వీరప్పన్ ను చంపిన పోలీస్ ఆఫీసర్ కథతో కిల్లింగ్ వీరప్పన్ తీశాడు. ఇప్పుడు వీరప్పన్ జీవిత కథని హిందీలో వీరప్పన్ గా తీస్తానంటూ వర్మ తెలిపాడు.  వర్మ మళ్లీ రాకతో బాలీవుడ్ కుర్ర హీరోలు జాగ్రత్తపడితే మంచిది లేదంటే తెలుగు హీరోలకు ఎదురైన చేదు అనుభవాలు తప్పవు. వీరప్పన్ విషయ సేకరణ కోసం తిరిగినప్పుడు రెండు కథలను సిద్ధం చేసుకుని ఉంటాడు. ఇది హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ చేసి తెలుగు జనాలపైకి వదులుతాడు. మళ్లీ వార్తల్లోకి వస్తాడన్నమాట. క్రైమ్ కథలను తీయడంలో ప్రసిద్దుడైన వర్మ తన చివరిచిత్రంగా ప్రకటించిన వంగవీటి గురించి మాత్రం అడుగు ముందుకువేయడం లేదనే మాట వినిపిస్తంది. అంటే రిటైర్ మెంట్ ప్రకటించడానికి ఇంకొంత సమయం తీసుకుంటాడన్నమాట. ఇటీవల పవన్ కల్యాణ్ ఇచ్చిన రివర్స్ పంచ్ వర్మపై బాగా పనిచేసింది. ఆ మధ్య ఎటాక్ అనే సినిమా తీస్తే అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చిత్ర దర్శకుడిగా ప్రమోషన్ కోసం ఏ మాత్రం ఆలోచించకుండా, ముంబాయిలో మోడల్స్ తో మందు కొట్టి ఎంజాయ్ చేశాడు. ఆ ఫోటోలు పోస్ట్ చేసి, గౌరవం మరింత తగ్గించుకున్నాడు. ఇదండి వర్మ తీరు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ