Advertisementt

వర్మ, నిహారిక..ఆవేదనలకు అర్ధం ఉంది!

Wed 13th Apr 2016 10:53 PM
sardaar gabbar singh,pawan kalyan,niharika,ram gopal varma,rgv,sgs  వర్మ, నిహారిక..ఆవేదనలకు అర్ధం ఉంది!
వర్మ, నిహారిక..ఆవేదనలకు అర్ధం ఉంది!
Advertisement
Ads by CJ

మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక త్వరలో 'ఒక మనసు' ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మెగాఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయం అవుతోన్న తొలి మెగా వారి ఆడపడుచు ఈ అమ్మడు. కాగా తాజాగా ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి బాబాయ్‌ నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా చూసిందట. ఆమెకు ఈ చిత్రం బాగా నచ్చిందట. కానీ ఈ చిత్రానికి తొలిరోజు నుండే నెగటివ్‌ టాక్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా నెగటివ్‌ ప్రచారం చేస్తోన్న వారిపై నిహారిక మండిపడుతోంది. సినిమా చాలా బాగుందని.. కావాలనే కొందరు బాబాయ్‌ సినిమాపై బ్యాడ్‌ కామెంట్స్‌ చేస్తున్నారని మండిపడుతోంది. నిహారిక తీరు చూసిన కొందరు విశ్లేషకులు ఆమె నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సినిమా రంగానికి కొత్త కాబట్టి ఆమె తొండరపడి మాట్లాడుతోంది. మున్ముందు ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురవుతాయి. సహనంగా ఉండటం నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. 

కాగా పవన్‌కు, వర్మకు ఏమి జరిగిందో ఎవరికి తెలియదు కానీ వర్మ మాత్రం పవన్‌పైన, ఆయన అభిమానుల పైనా ఓ రేంజ్‌లో యుద్దం ప్రకటిస్తూ ట్వీట్స్‌ చేస్తూ ఉన్నాడు. పవన్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ ట్విట్టర్‌వేదికగా పవర్‌స్టార్‌ గురించి ప్రస్తావిస్తూ ఆయన తాజాగా ఓ జనరంజకమైన ట్వీట్‌ చేశాడు. తాను మంచి ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నప్పటికీ ప్రతి ఒక్కరు అపార్ధం చేసుకుంటున్నారని, ఇకపై జీవితంలో పవన్‌ గురించి ఎటువంటి ట్వీట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. చివరగా ఆయన 'బై..బై. పవన్‌ ఫ్యాన్స్‌.. ' అంటూ ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు ఆయన... పవన్‌ తన ఉద్దేశ్యాలని అర్ధం చేసుకున్నాడని, ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత అది అర్థమైందని ట్వీట్‌ చేశాడు. పవన్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు చివరగా చెబుతున్నాను. పవన్‌ని నిద్రలేపాల్సిన బాధ్యత ఆయన అభిమానులపైనే ఉంది. విదేశీ డబ్బింగ్‌ చిత్రం 'ది జంగిల్‌బుక్‌' హౌసుఫుల్‌ కలెక్షన్స్‌తో నడుస్తుంటే. పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కు ప్రేక్షకులు లేకపోవడం బాధ కలిగిస్తోంది. పవన్‌ని నిద్ర నుంచి, ఆయన చుట్టూ ఉన్న భజనపరుల నుండి వేరు చేసి, పవన్‌ని మంచి దారిలో పెట్టేందుకు సమయం వచ్చేసింది... అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక వర్మ పవన్‌ గురించి అసలు మాట్లాడడా, ట్వీట్స్‌ చేయలేనంతగా ఆయన హర్ట్‌ అయ్యాడా? అనేది అందరిలో కలుగుతున్న అనుమానం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ