Advertisementt

'పోలీసోడు' ప్రాముఖ్యత ఏంటంటే..?

Wed 13th Apr 2016 06:28 PM
policeodu,theri,vijay,tamil big star movie,24,kabali,dil raju  'పోలీసోడు' ప్రాముఖ్యత ఏంటంటే..?
'పోలీసోడు' ప్రాముఖ్యత ఏంటంటే..?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఈ ఏడాది సంక్రాంతి నుంచి ఇప్పటివరకు చాలామంది స్టార్స్‌ నటించిన చిత్రాలు విడుదల అయ్యాయి... అవుతున్నాయి....! కానీ కోలీవుడ్‌లో మాత్రం ఈ ఏడాది మొదలై నాలుగునెలలు అవుతున్నా కూడా ఒక్క స్టార్‌ హీరో చిత్రం కూడా రాలేదు. ఇప్పటివరకు కేవలం చిన్న హీరోలు, మీడియం హీరోల చిత్రాలు మాత్రమే వచ్చాయి. దాంతో తమిళ తంబీలు చాలా నిరాశగా ఉన్నారు. వీరందరి లోటును తీరుస్తూ ఈ ఏడాది వస్తున్న మొదటి స్టార్‌ చిత్రంగా విజయ్‌ నటించిన 'తేరీ' చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ 14న రిలీజ్‌ అవుతోంది. మరి ఈ చిత్రం రాబోయే '24, కబాలి' వంటి చిత్రాలకు ఎలాంటి దారి చూపుతుందోనని కోలీవుడ్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గత ఏడాది ఎన్నో అంచనాలతో వచ్చిన 'పులి' చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో 'తేరీ'తో మరలా ఫామ్‌లోకి రావాలని విజయ్‌ ఆశిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో విజయ్‌ మూడు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నాడు. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ప్రధానమైనది. 'పోక్కిరి, తుపాకి' చిత్రాలలో పోలీస్‌గా అదరగొట్టిన విజయ్‌ ఈ చిత్రంలో కూడా తనకు అచ్చివచ్చిన పోలీస్‌ పాత్రలో నటిస్తుండటం  విశేషం. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే బాధ్యతను విజయ్‌.. దిల్‌రాజు చేతిలో పెట్టడంతో తెలుగులో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ చిత్రం లేని విజయ్‌ ఆశలన్నీ ఈ చిత్రం తెలుగువెర్షన్‌ 'పోలీసోడు' పైనే ఉన్నాయి. మరి ఎన్నో ఆశలతో వస్తున్న ఈ చిత్రం విజయ్‌ కలలని నెరవేరుస్తుందో లేదో వేచిచూడాలి! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ