Advertisementt

ఈ విషయం బాలయ్యకు తెలుసా?

Wed 13th Apr 2016 11:09 AM
chiranjeevi,balakrishna,boyapati sreenu,legend,simha,balakrishna angry on boyapati sreenu  ఈ విషయం బాలయ్యకు తెలుసా?
ఈ విషయం బాలయ్యకు తెలుసా?
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణకు-దర్శకుడు బోయపాటి శ్రీనుకు మధ్య దూరం పెరుగుతోంది.  ఇద్దరి మధ్య గతంలో మాదిరిగా గుడ్‌ రిలేషన్ లేదన్నది వాస్తవమేనని అంటున్నారు సినీజనాలు. తన కెరీర్‌కు కీలక సమయంలో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ విజయాలు అందించిన దర్శకుడిని బాలయ్య ఎందుకు దూరం పెడుతున్నాడో... అందుకు కారణాలేమిటో స్పష్టంగా తెలియడం లేదు. తొలుత తన వందో సినిమా బోయపాటి దర్శకత్వంలో చేస్తానని ప్రకటించినా.. ఆ తర్వాత పలు పేర్లు ఆ జాబితాలో చేరాయి. చివరిగా బాలయ్య క్రిష్‌కు ఓటేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘సరైనోడు’ ఆడియో సక్సెస్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ బాలయ్య నటించిన సింహా, లెజెండ్ కథలను బోయపాటి తనకు చెప్పాడని చెప్పడంతో.. అందరూ ఆశ్చర్చపోయారు. కేవలం బాలకృష్ణకే టైలర్‌మేడ్‌గా వుండే ఆ చిత్ర కథలను బోయపాటి చిరంజీవికి ఎందుకు వినిపించాడో.. అసలు ఈ విషయం ఇప్పుడు బాలయ్యకు తెలిస్తే.. ఇద్దరి మధ్య మరింత దూరం పెరగడం ఖాయమని అంటున్నారు ఫిల్మ్‌నగర్ వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ