తొలిరోజు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర రికార్డు సృష్టించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' రెండో రోజుకి సగానికి సగం కలె క్షన్స్ పడిపోయాయి. ఇక మూడో రోజు వచ్చేసరికి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం థియేటర్ల దగ్గర జనాలు కూడా లేని పరిస్థితి. మొదటిరోజు సుమారుగా ముప్పై కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చిన సర్దార్ మిగిలిన రెండు రోజులు కలిపి కనీసం ఇరవై కోట్లు కూడా సాధించకపోవడంతో నిర్మాతలకు నష్టాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారుగా మొదటి మూడు రోజుల్లో నలభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. సోమవారం నుండి వసూళ్ళ పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ఈ సినిమా యాభై కోట్లైనా.. సాధిస్తుందో లేదో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా నైజాంలో డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది..!