కొన్ని ట్రైలర్స్ చూసిన వెంటనే అర్జెంట్ గా సినిమా చూడాలనే కుతూహలం కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ కలిగే సినిమాల్లో ఇప్పుడు సూర్య నటించిన 24 సినిమా కూడా చేరింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం హైదరాబాద్ లోని రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ తో అంచనాలను రెట్టింపు చేసింది. హీరోగా, విలన్ గా మరొక డిఫరెంట్ క్యారెక్టర్ లో సూర్య కనిపిస్తున్నాడు. విలన్ గా సూర్య లుక్ అదిరిపోయింది. సమంత, నిత్యమీనన్ చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. కథను రివీల్ చేయకుండా విక్రం తనదైన స్టైల్ లో ట్రైలర్ ను కట్ చేశాడు. విజువల్స్ అన్నీ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. రెహ్మాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ను మరింత ఎలివేట్ చేసేలా చేశాయి. గ్రిప్పింగ్ గా సాగిన ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరగడం ఖాయం..!