'సర్దార్‌గబ్బర్‌సింగ్' ఫలితం చూసి ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా చాలా నిరాశ చెందారు. దాంతో గ్యాప్ లేకుండా మరో సినిమాను వెంటనే ప్రారంభించి ఇదే ఏడాది విడుదల చేయడానికి పవన్ డిసైడ్ అయ్యాడని సమాచారం. అందులో భాగంగానే ఆయన ఎస్.జె.సూర్యతో చేయబోయే చిత్రాన్ని ఈనెల 29నే ప్రారంభించేందుకు డిసైడ్ అయ్యాడట. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను కూడా ఆల్‌రెడీ అనూప్‌రూబెన్స్ నేతృత్వంలో రికార్డింగ్ చేసేశారు. పవన్ ఇంత స్పీడ్‌గా నిర్ణయం తీసుకుంది తన అభిమానుల కోసమే అని అంటున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతో చేయడమే శ్రేయస్కరమని, కేవలం 'ఖుషీ' హిట్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం తప్పు నిర్ణయమనీ, అదే సూర్య పవన్‌కు ఆల్‌రెడీ 'కొమరం పులి' అనే డిజాస్టర్ ఇచ్చి దర్శకుడిగా కనుమరుగైపోయిన వ్యక్తిని తెచ్చి ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సినిమా చేయడం మంచిది కాదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా తమిళ 'వేదలం'కి సంబంధించిన రీమేక్‌కు చేయాల్సిన మార్పులు చేర్పులపై ప్రస్తుతం సిట్టింగ్స్ జరుగుతున్నాయని పవన్ కన్‌ఫర్మ్ చేశాడు. మరి సూర్య దర్శకత్వంలో పవన్ చేయబోయే చిత్రం ఫ్రెష్ సబ్జెక్టా? లేక 'వేదలం' రీమేకా? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది.