Advertisementt

'సరైనోడు' ట్రైలర్ ఊర మాస్!

Mon 11th Apr 2016 06:30 PM
sarainodu trailer talk,allu arjun,boyapati sreenu  'సరైనోడు' ట్రైలర్ ఊర మాస్!
'సరైనోడు' ట్రైలర్ ఊర మాస్!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న 'సరైనోడు' సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన సినిమా టీజర్ అంచనాలను మరింత పెంచింది. ఆదివారం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మాస్ ఎలిమెంట్స్ తో సుమారుగా ఒకటిన్నర నిమిషం పాటు సాగిన ఈ ట్రైలర్ లో ''ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు.. దమ్ము.. ఇక్కడ అది టన్నుల టన్నుల కొద్దీ ఉంది చూస్తావా..?'' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ లో బోయపాటి మార్క్ అడుగడుగునా కనిపిస్తోంది. సినిమా కథను రివీల్ చేయకుండా చాలా ఆసక్తికరంగా కట్ చేశాడు. ఎనీ టైం.. ఎనీ వేర్.. ఎనీ బడీ.. నేను రెడీ అంటూ ఏప్రిల్ 22న వస్తున్నాడు 'సరైనోడు'. ట్రైలర్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ