Advertisementt

'సర్దార్‌'ను 'సరైనోడు' సీక్రెట్‌గా చూశాడంట!

Mon 11th Apr 2016 06:01 PM
sardaar gabbar singh,sarrainodu,secret watch,x roads hyderabad,allu arjun  'సర్దార్‌'ను 'సరైనోడు' సీక్రెట్‌గా చూశాడంట!
'సర్దార్‌'ను 'సరైనోడు' సీక్రెట్‌గా చూశాడంట!
Advertisement
Ads by CJ

స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ తన భార్య స్నేహారెడ్డితో పాటు మరి 20మంది స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో రహస్యంగా 'సర్దార్‌' చిత్రాన్ని వీక్షించినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ ఆయన ఈ చిత్రం ఎలా ఉంది? అనే విషయంపై మీడియా ఎదుట ఇప్పటివరకు నోరు విప్పలేదు. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత మెగా కాంపౌండ్‌ నుండి ఎలాంటి స్పందన రాలేదు. చిత్ర యూనిట్‌ కూడా మౌనాన్నే ఆశ్రయిస్తోంది. డైరెక్టర్‌ బాబి అభిమానులకు కృతజ్ఞతలంటూ ఓ ట్వీట్‌ చేశాడు అంతే. ఇక ఈ చిత్రంపై స్పందించింది కేవలం హీరోయిన్‌ కాజల్‌ మాత్రమే. ఈమె ఈ చిత్రాన్ని విడుదలైన మొదటి రోజునే చూసిందట. ప్రేక్షకులలో మరీ ముఖ్యంగా పవన్‌ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇందులో పవన్‌ గారు అదరగొట్టారు. ఇదో పక్కా మాస్‌ చిత్రం అంటూ ఆమె తన స్పందనను తెలిపింది.
కాగా అల్లుఅర్జున్‌ విషయానికి వస్తే ఆయనకు మలయాళంలో కూడా మంచి క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ అల్లుఅర్జున్‌ను అందరూ ముద్దుగా మల్లూ అర్జున్‌ అని పిలుస్తుంటారు. ఇక్కడ ఫ్లాప్‌ అయిన కొన్ని బన్నీ చిత్రాలు మలయాళంలో కూడా మంచి హిట్‌ అయిన విషయం కూడా తెలిసిందే. తాజాగా అల్లుఅర్జున్‌ నటిస్తోన్న 'సరైనోడు' చిత్రం ఈనెల 22న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని మలయాళంలో 'యోధవ్‌.. ది వారియర్‌' పేరుతో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేధరిన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ