Advertisementt

శ్రీనువైట్లకు కాలం మరీ ఇంత అడ్డం తిరిగిందేంటి!

Mon 11th Apr 2016 12:36 PM
srinu vaitla,varun tej,aagadu,brucelee,srinu vytla movies,srinu vaitla bad time  శ్రీనువైట్లకు కాలం మరీ ఇంత అడ్డం తిరిగిందేంటి!
శ్రీనువైట్లకు కాలం మరీ ఇంత అడ్డం తిరిగిందేంటి!
Advertisement
Ads by CJ

ఒక్కసారి తన కెరీర్‌ ఊపందుకున్న తర్వాత శ్రీనువైట్లతో చిత్రాలు చేయాలని అందరూ ఆసక్తి చూపించారు. ముఖ్యంగా 'ఢీ' నుండి మొదలైన ఆయన ప్రస్ధానం 'దూకుడు' వరకు దూకుడుగానే సాగింది. ఆయన ఏ కథ చెప్పినా కూడా ఆయన చెప్పిన కథలు అందరికీ నచ్చేశాయి. కానీ 'ఆగడు'తో ఈ పరంపరకు బ్రేక్‌లు పడ్డాయి. దాంతో ఆ తర్వాతి చిత్రం 'బ్రూస్‌లీ' విషయంలో కూడా శ్రీనువైట్ల చెప్పిన కథకి ఎన్నో మార్పులు, చేర్పులు చేసింది మెగాకాంపౌండ్‌. అంతేకాదు తనతో విడిపోయిన కోన, గోపీమోహన్‌లతో పనిచేయాల్సిందే అని మెగా కాంపౌండ్‌ ఇచ్చిన ఆదేశానికి కూడా శ్రీను తలవంచాడు. ఈ చిత్రం ప్రారంభం విషయంలో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఆయన అన్నింటిని భరించాడు. కానీ ఆ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో ఇక శ్రీనువైట్ల అంటే అందరు హీరోలు దూరంగా ఉంచారు. ఒకప్పుడు ఏ కథ చెప్పినా నచ్చిందని ఒప్పుకొన్న హీరోలే ఇప్పుడు ఆయన ఏ కథ చెప్పినా నచ్చడం లేదంటున్నారు. చివరకు వరుణ్‌తేజ్‌ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయాడు. వాస్తవానికి వరుణ్‌తేజ్‌- శ్రీనువైట్లల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాన్ని ఉగాదినాడు ప్రారంభిస్తామని నిర్మాతలు అఫీషయల్‌గా కూడా తెలిపారు. కానీ ఈ చిత్రం ఉగాదికి ప్రారంభం కాలేదు. ఈ చిత్రం స్క్రిప్ట్‌లో వరుణ్‌తేజ్‌ కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడని, దాంతో శ్రీనువైట్ల ఐదు సినిమాల అనుభవం కూడా లేని వరుణ్‌తేజ్‌ మాటలకు కూడా తలొగ్గాల్సి వస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజమే.. ఫ్లాప్‌ డైరెక్టర్‌ అంటే అందరికీ లోకువే కదా..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ