టన్నుల కొద్దీ మాటలకన్నా.. ఒక ఔన్స్ పని చేయడం మంచిది. నిజంగా సమాజం పట్ల అంత ఆసక్తి ఉన్నప్పుడు ఏదైనా చేయాలి. నేను మాట్లాడగలనని అనిపించింది. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకున్నాను అంటూ పవన్ కళ్యాన్ తన రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలను తెలియజేశారు. ప్రశ్నించడానికే జనసేన వచ్చింది. రెండు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుంది. జనసేన పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం గురించి ఆలోచించలేదు. జనసేనలో నేనేం మాట్లాడినా.. నేనే బాధ్యత వహిస్తాను. ప్రజారాజ్యంలో నేనేం మాట్లాడినా.. అన్నయ్య బాధ్యత వహించాల్సి వచ్చేది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజారాజ్యంలో చేసినప్పుడు పరిమితులు ఉండేవని.. అన్నయ్యతో రాజకీయ పరంగా అభిప్రాయ భేదాలున్నాయి కానీ కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. అన్నయ్య పూర్తి స్థాయి కాంగ్రెస్ వాది. జనసేనలోకి రమ్మని అన్నయ్యను అడగను.