Advertisementt

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా: పవన్ కళ్యాణ్

Sun 10th Apr 2016 08:19 PM
pawan kalyan,trvikram srinivas,s.j.surya  ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా: పవన్ కళ్యాణ్
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా: పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

నా దగ్గర ఎక్కువగా డబ్బులు లేవు.. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నెల గడవాలంటేనే కష్టంగా ఉందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత తన పరిస్థితుల గురించి వివరించారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి, రాజకీయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముందుగా సినిమాల గురించి మాట్లాడుతూ.. ''ఫ్యాన్స్ అన్నయ్యతో పోల్చి అంచనాలు పెంచుకుంటారు. నా స్టైల్ లో నేను పని చేస్తుకుంటూ వెళతాను. నేను స్ట్రగుల్ చేసి పైకి వచ్చాను. నా పని చేస్తా.. నా ప్రయత్నం నేను చేస్తా. అంచనాలు పెరిగితే నెర్వస్ అవుతాను. సామాజిక అవగాహనపై సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఇష్టం లేని పని చేయను. స్టార్ డం కు ఎప్పడు కనెక్ట్ కాలేదు. ఒక్కరోజు కూడా నా స్టార్ డంను అనుభవించాలని అనుకోలేదు. నేను హడావిడిగా ఎక్కువ సినిమాలు చేయలేను. బహుశా రెండు సినిమాలు చేసి ఇక సినిమాలకు దూరమైపోతాను. త్రివిక్రమ్, ఎస్.జె.సూర్య లతో సినిమాలు చేయాలనుకుంటున్నాను'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ