Advertisementt

'సరైనోడు' తర్వాత బన్నీ లిస్టు చాలా వుంది!

Sun 10th Apr 2016 02:11 PM
sarrainodu movie,sarrainodu movie after bunny movie,allu arjun,trivikram srinivas  'సరైనోడు' తర్వాత బన్నీ లిస్టు చాలా వుంది!
'సరైనోడు' తర్వాత బన్నీ లిస్టు చాలా వుంది!
Advertisement
Ads by CJ

అల్లుఅర్జున్‌, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో గీతాఆర్స్‌ పతాకంపై అల్లుఅరవింద్‌ నిర్మిస్తున్న చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రం వెనుక మాస్టర్‌మైండ్‌ అల్లు అరవింద్‌ ఉండటంతో ఈ చిత్రం ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్‌ వర్గాలు కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం తర్వాత బన్నీ చిత్రం ఏమిటనే? చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతానికి బన్నీ ఇప్పుడే లింగుస్వామితో చేసే ఉద్దేశ్యంలేదు. విక్రమ్‌ కె.కుమార్‌తో చేయబోయే చిత్రం ఆలస్యం కానుంది.'24' రిలీజైన తర్వాతే విక్రమ్‌ కె.కుమార్‌.. బన్నీ స్క్రిప్ట్‌పై కూర్చోనున్నాడు. ఇక మరోవంక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రస్తుతం 'అ...ఆ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మే 6వ తేదీన విడుదలకానుంది. మరోవైపు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సూర్య నటించే చిత్రానికి సంబంధించిన సినిమా కూడా ఆలస్యం కానుంది. ప్రస్తుతం సూర్య '24' చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. మరోవంక ఆయన హరి దర్శకత్వంలో చేస్తున్న 'సింగం3' చిత్రంపై ఆయన ఫోకస్‌ పెట్టనున్నాడు. కాబట్టి త్రివిక్రమ్‌-సూర్యల చిత్రం కూడా బాగా లేటయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వద్ద బన్నీకి సూటయ్యే స్టోరీ ఆల్‌రెడీ పక్కా స్క్రిప్ట్‌తో రెడీగా ఉందని సమాచారం. సో..గ్యాప్‌లో బన్నీ- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో 'జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి' తర్వాత హ్యాట్రిక్‌ మూవీగా ఓ చిత్రం తెరకెక్కనుందని, దీన్ని కూడా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మించనున్నాడని విశ్వసనీయ సమాచారం.