శ్రీ దుర్ముఖి నామసంవత్సర ఉగాదినాడు టాలీవుడ్.. పలు చిత్రాల ఫస్ట్‌లుక్‌లు, ఓపెనింగ్స్‌తో కళకళలాడింది. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'బ్రహ్మోత్సవం' లుక్ అదిరిపోయింది. మహేష్ చేత చెప్పులు తొడిగించుకునే వ్యక్తి ఎవరబ్బా? అనే ఆసక్తిని రేకెత్తించింది. ఇక 'ప్రేమమ్' చిత్రం పోస్టర్‌లో నాగచైతన్య.. శృతిహాసన్‌ను దొంగ చూపులు చూస్తున్న లుక్ అందరికీ నచ్చింది. ఇక 'అ..ఆ' పోస్టర్‌లో నితిన్, సమంత నవ్వులు చిందిస్తూ విడుదల చేసిన లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక 'బాబుబంగారం'లో సీనియర్‌స్టార్ వెంకటేష్ ఎంతో రిఫ్రెషింగ్‌గా కనిపిస్తున్నాడు. మెగా తనయ నిహారిక హీరోయిన్‌గా నటిస్తోన్న 'ఒక్క మనసు' చిత్రం పోస్టర్ కూడా అద్భుతంగా ఉంది. నిహారిక నుదిటిపై నాగశౌర్య పెడుతున్న ముద్దులుక్ ఎంతో పొయిటిక్‌గా ఉంది. 'మల్లెలతీరం...' దర్శకుడు రామరాజు క్రియేటివిటీకి ఈ పోస్టర్ అద్దం పడుతోంది. అల్లు అర్జున్ బర్త్ డే..అలాగే 'సర్దార్ గబ్బర్ సింగ్' రిలీజ్..మెగాభిమానుల కి సందడి కాగా.. బాలకృష్ణ తాను నటించే 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్ర ప్రకటన కూడా ఆయన అభిమానులకు మంచి ఆనందాన్ని కలిగించింది. రామ్.. కందిరీగ శ్రీనివాస్ తో మూవీ ఓపెనింగ్ తో పాటు ఇంకొన్ని చిత్రాల హంగామా తో మొత్తానికి ఈ ఉగాదికి టాలీవుడ్ కళకళలాడింది.