తన కెరీర్‌లో 'శివపుత్రుడు, గజిని, యముడు, సింగం' వంటి అద్బుత విజయాలను సొంతం చేసుకొని తమిళంతోపాటు తెలుగులోనూ స్టార్‌హీరో సూర్య మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఒకానొక దశలో ఆయన మార్కెట్ టాలీవుడ్‌లో 15 నుంచి 20కోట్లకు మద్యకు చేరింది. కానీ ఇటీవల కాలంలో ఆయన నటించిన పలు చిత్రాలు కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లో కూడా డిజాస్టర్స్‌గా నిలవడంతో సూర్య మార్కెట్ ప్రస్తుతం 10కోట్లకు పడిపోయింది. దీంతో సూర్య తన తాజా చిత్రమైన '24'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సూర్యతో పాటు ఈ చిత్ర దర్శకుడు విక్రమ్.కె.కుమార్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రంపై టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజే ఉంది. దీంతో సూర్య సైతం ఈ చిత్రం విషయంలో తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ ప్రమోషన్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ చిత్ర తెలుగు వెర్షన్ హక్కులను హీరో నితిన్ చేతిలో పెట్టిన సూర్య, ఈ చిత్రం ఆడియో విడుదల విషయంలో కూడా తెలుగుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. తమిళ ఆడియోతో పాటు తెలుగు ఆడియోను సైతం ఈనెల 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉదయం తమిళ ఆడియోను రిలీజ్ చేసి అదే రోజు సాయంత్రం తెలుగు ఆడియోను ఘనంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. '24' తర్వాత ఎలాగూ హరి దర్శకత్వంలో 'సింగం3', ఆపై త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల సినిమాలు ఉండటంతో టాలీవుడ్‌లో 'ఆపరేషన్ ఆకర్ష్'కు సూర్య తెరదీస్తున్నాడు.మరి ఆయన స్ట్రాటర్జీ వర్కౌట్ అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది...!