Advertisementt

శర్వానంద్‌ చిత్రానికి దర్శకుడు ఫిక్స్!

Sat 09th Apr 2016 01:58 PM
sharvanand,palnati surya pratap,sharvanand new movie,express raja,run raja run  శర్వానంద్‌ చిత్రానికి దర్శకుడు ఫిక్స్!
శర్వానంద్‌ చిత్రానికి దర్శకుడు ఫిక్స్!
Advertisement
Ads by CJ

తెలుగులో వైవిధ్యమైన చిత్రాలు చేయడంలో ముందుండే యువహీరో శర్వానంద్‌. కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోన్న శర్వా 'రన్‌ రాజా రన్‌,  మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రాలతో హ్యాట్రిక్‌ జోరులో ఉన్నాడు. కాగా ఈయన ప్రస్తుతం చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులువేస్తున్నాడు. 'ఎక్స్‌ప్రెస్‌రాజా' విడుదలై మూడునెలలు కావస్తున్నా, మరో సినిమాను ఇప్పటివరకు శర్వానంద్‌ అంగీకరించలేదు. 'రా..రా..కృష్ణయ్య' ఫేమ్‌ మహేష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తాడని వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. కాగా గతేడాది విడుదలైన 'కుమారి 21ఎఫ్‌' చిత్ర దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్‌.. శర్వానంద్‌కు చెప్పిన స్టోరీ పాయింట్‌ బాగా నచ్చడంతో ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి శర్వానంద్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ను తయారుచేసే పనిలో ఉన్న సూర్యప్రతాప్‌ త్వరలోనే స్క్రిప్ట్‌వర్క్‌ను పూర్తి చేయనున్నాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ