Advertisementt

ఈ పంజాబీ బ్యూటీ మరో సాహసం!

Fri 08th Apr 2016 07:24 PM
charmi,janaganamana movie,charmi new movie,jyothi lakshmi movie  ఈ పంజాబీ బ్యూటీ మరో సాహసం!
ఈ పంజాబీ బ్యూటీ మరో సాహసం!
Advertisement
Ads by CJ

ఈమధ్యకాలంలో హీరోయిన్‌ చార్మి కెరీర్‌ చాలా డల్‌గా సాగుతోంది. చేయడానికి ఐటంసాంగ్స్‌ కూడా లేక ఇబ్బందులు పడుతోంది. పూరీతో ఆమె చేసిన 'జ్యోతిలక్ష్మి' చిత్రం ఆమెకు నిర్మాతగా, నటిగా కూడా నిరాశనే మిగిల్చింది. అటు ఇటు కాని పరిస్థితుల్లో ... ఐటంకు ఎక్కువ... హీరోయిన్‌కి తక్కువ అన్నట్లు ఆమె కెరీర్‌ ప్రమాదంలో పడింది. సాధారణంగా మన టాలీవుడ్‌లో ఎవరైనా హీరోయిన్‌ లేడీ ఓరియంటెడ్‌ చిత్రం చేస్తోంది? అంటే ఇక ఆ అమ్మడు కెరీర్‌ చరమాంకంలో ఉన్నట్లే లెక్క. కాగా పూరీ కాంపౌండ్‌లో పెద్దగా వర్కౌట్‌ కాకపోవడంతో నిన్నటి కాలానికి చెందిన ఓ తెరమరుగైన టాప్‌ డైరెక్టర్‌తో ఆమె నిర్మాతగా, తనే ప్రధానపాత్ర చేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కించే ఉద్దేశ్యంలో చార్మి ఉందని తెలుస్తోంది. ఆల్‌రెడీ ఈచిత్రం కోసం ఆమె 'జనగణమన' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఆమె ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ