ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్, ఓవర్సీస్‌లో కూడా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఫీవర్ పట్టుకుంది. సినిమా విడుదల గురించి కోట్లాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత మళ్ళీ ఆ రేంజ్‌కు కాస్త అటు ఇటుగా క్రేజ్‌ను రాబట్టుకున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అంటున్నారు సినీవర్గాలు. అయితే ‘సర్దార్’కు ముందు పవన్ నటించిన చిత్రం ‘అత్తారింటికి దారేది’. ఈ చిత్రం అప్పటి వరకు వున్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే లీక్ అవ్వడం.. విడుదల తర్వాత వారానినే పూర్తి సినిమా హెచ్‌డీ ప్రింట్‌లో పైరసీ కావడం ఆ చిత్ర యూనిట్‌ను కలవరపరిచింది. అయితే పవన్ ఛరిష్మా ముందు పైరసీ పనిచేయలేదు. సినిమా విడుదలకు ముందే లీక్ అయినా.. వారానినే పూర్తి క్లారిటీ ప్రింట్ వచ్చేసినా.. అత్తారింటికి దారేది ప్రభంజనం మాత్రం ఆగలేదు. దాదాపు 80కోట్లకు పైగా వసూలు చేసి పాత రికార్డులను తిరగరాసింది. అయితే ప్రస్తుతం వున్న పవన్ క్రేజ్, పాపులారిటీ వేరు. అందుకే పవన్ అభిమానులు ‘విడుదలకు ముందే.. లీక్ అయినా సినిమానే అంతా కలెక్ట్ చేస్తే.. సర్దార్ గబ్బర్‌సింగ్ ఎంత కలెక్ట్ చెయ్యాలి అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. సినిమాలో కాస్త కూస్తో కథ వుంటే...మిగతాది మా పవన్ చూసుకుంటాడు.. తప్పకుండా సర్దార్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని.. 100 కోట్ల మార్క్‌ని అవలీలగా దాటుతుందని అంచనా వేస్తున్నారు. సో.. ఏది ఏమైనా సర్దార్ పవర్ తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగక తప్పదు..!